24 ఏళ్ల తర్వాత ఫైనల్లో ఇంగ్లాండ్..

70
afgan
- Advertisement -

అండర్ 19 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ అద్భుతం చేసింది. 24 ఏళ్ల తర్వాత ఫైనల్లో ప్రవేశించింది. అంటిగ్వా వేదికగా జరిగిన సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌ను ఓడించి టైటిల్‌ వేటలో అడుగుదూరంలో నిలిచింది. ఇంగ్లాండ్ విధించిన 232 పరుగుల లక్ష్యచేదనలో అఫ్ఘాన్…9 వికెట్లు మాత్రమే కొల్పోయి 215 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 15 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది.

అంతకముందు తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌… 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఓపెనర్‌ జార్జ్‌ థామస్‌ అర్ధ సెంచరీ(50 పరుగులు)తో ఆకట్టుకోగా… జార్జ్‌ బెల్‌ 56 పరుగులు, వికెట్‌కీపర్‌ అలెక్స్‌ హార్టన్‌ 53 పరుగులతో రాణించారు.

బుధవారం భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.

- Advertisement -