అప్పుడు సీనియర్స్..ఇప్పుడు జూనియర్స్!

35
- Advertisement -

అంతర్జాతీయ టోర్నీలు భారత్ కు ఏ మాత్రం కలిసి రావడం లేదు. లీగ్ దశలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే టీమిండియా ఫైనల్ లో మాత్రం చేతులెత్తేస్తోంది. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో సీనియర్ జట్టు అలాగే నిష్క్రమించింది. ఇప్పుడు అండర్ 19 వరల్డ్ కప్ లో జూనియర్ టీం కూడా అదే సీన్ రిపీట్ చేసింది. అయితే రెండు టీం లు కూడా ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలోనే ఓటమిపాలు కావడం గమనార్హం. అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా లీగ్ దశలో అపజయం ఎరుగని జట్టుగా ఆడిన ప్రతి మ్యాచ్ లో విజయం సాధిస్తూ వచ్చింది. కానీ ఫైనల్ లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవి చూసి తృటిలో కప్పు చేజార్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. .

కానీ లక్ష్య చేధనలో టీమిండియా 174 పరుగులకే ఆలౌట్ గా నిలిచి కప్పు చేజార్చుకుంది. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఇప్పటివరకు టీమిండియా రెండు సార్లు మాత్రమే ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. తొలిసారి ఉన్మక్త్ చంద్ నాయకత్వంలో, రెండోసారి పృధ్వీ షా నాయకత్వంలో మాత్రమే విజయం సాధించింది. ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే అంతర్జాతీయ టోర్నీలలో ఆ జట్టు తిరుగులేని ఆదిపత్యం ప్రదర్శిస్తోంది. 2022 టీ20 వరల్డ్ కప్, 2023 వన్డే వరల్డ్ కప్, 2024 అండర్ 19 వరల్డ్ కప్.. ఇలా ఏ జట్టుకు సాధ్యం కానీ రీతిలో వరల్డ్ కప్పులను సొంతం చేసుకుంటూ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఏది ఏమైనప్పటికి గత ఏడాది సీనియర్ జట్టును దెబ్బ తీసిన ఆస్ట్రేలియా… ఇప్పుడు జూనియర్ జట్టును కూడా దెబ్బ తీయడంతో టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Also Read:వైసీపీ క్లారిటీ.. రాజధాని ‘అమరావతే’!

- Advertisement -