హాంకాంగ్‌లో తుఫాను బీభత్సం..

8
- Advertisement -

హాంకాంగ్‌లో తుపాను బీభత్సం సృష్టించింది. గంటకు 160 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయగా తుపాను కారణంగా 400 విమానాలు రద్దు అయ్యాయి. నిరాశ్రయులైన వేలాది మందికి సహాయ కేంద్రాలలో ఆశ్రయం అందిస్తున్నారు.

చైనాలో తుఫాన్ బీభత్సం కారణంగా 400కు పైగా భవనాలు ధ్వంసం అయ్యాయి. చైనాలో 140 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. తుపాన్‌ బీభత్సానికి దక్షిణ కొరియాలో 17 మంది మృతి చెందారు. విమాన, రవాణా సేవలు తీవ్ర అంతరాయం కలిగాయి. వైఫా తుఫాన్ చైనా దక్షిణ తీర ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది.

ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని.. అనవసర ప్రయాణాలు చేయవద్దని హాంకాంగ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అదేసమయంలో చైనా ఆర్థిక వ్యవస్థపైనా తుఫాన్‌ ప్రభావం చూపింది. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సేవలు, సహాయక బృందాలు ప్రజలను కాపాడేందుకు, ధ్వంసమైన ప్రాంతాలను శుభ్రపరిచేందుకు రంగంలోకి దిగాయి.

Also Read:నేటి నుండి పార్లమెంట్ సమావేశాలు

- Advertisement -