- Advertisement -
తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్ వద్ద కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పై 50 మంది దుండగులు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే వాహనంపై ఒక్కసారిగా దూసుకొచ్చారు గుర్తు తెలియని వ్యక్తులు. గన్‌మెన్ల పైనా దాడికి యత్నించగా వారి నుంచి తప్పించుకొని ఓయూ పీఎస్ లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే.
ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై దాడికి యత్నించినవారిపై చర్యలు తీసుకుంటాం అని డీసీపీ బాలస్వామి తెలిపారు. ఎమ్మెల్యే బోనాల వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తుండగా ఘటన జరిగింది అని చెప్పారు.
ఆరు వాహనాలలో మొత్తం 12 మంది ఉన్నట్లు తెలుస్తోండగా యువకుల వాహనాలకు సైడ్ ఇవ్వకపోవడమే వాగ్వాదానికి కారణం అన్నారు. సీసీ కెమెరా దృశ్యాల బట్టి యువకులు అడిక్‌మెట్ వైపు వెళ్లినట్లు గుర్తించాం అన్నారు.
Also Read:నేటి నుండి పార్లమెంట్ సమావేశాలు
- Advertisement -

