టీవర్క్స్ ప్రారంభించిన లియూ, కేటీఆర్‌

15
- Advertisement -

దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్‌ కేంద్రం(టీ-వర్క్‌)ను ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్‌లియూతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాయదుర్గం ఐటీ కారిడార్‌లో ఒకే చోట సుమారు 18ఎకరాల్లో టీ-హబ్‌, టీ-వర్క్స్‌ ఇమేజ్‌ టవర్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో నిధులు వెచ్చించి ప్రజల కోసం తీసుకొస్తున్నదని చెప్పారు. ఉత్పత్తుల ఆవిష్కరణలో దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా టీవర్క్స్‌ను ప్రభుత్వం డిజైన్‌ చేసిందన్నారు. దైనందిన జీవితంలో అవసరమయ్యే వస్తువులను వినూత్నంగా తయారుచేయాలన్న ఆలోచన ఉన్నవారు టీవర్క్స్‌కు వస్తే వారి ఆలోచనలకు అనుగుణంగా వస్తువులను తయారు చేసుకొనే అవకాశం కల్పిస్తామన్నారు.

టీవర్స్క్‌ మొదటి దశ 78వేల చదరపు అడుగుల్లో ఉంటుందని ఇందులోనే ఉత్పత్తుల రూపకల్పన ఇంజినీరింగ్ ఫ్యాబ్రికేషన్ సోర్సింగ్ మెటీరియల్స్‌ ఇతర అంశాలపై టీవర్క్స్‌లో నిపుణులు అందుబాటులో ఉండి ఆవిష్కర్తలకు సహకరిస్తారని తెలిపారు. ఇంతవరకు 200కు పైగా అత్యాధునిక యంత్రాల కోసం రూ.110కోట్లు వెచ్చించామని మరో రూ.40కోట్ల వరకు కార్పొరేట్ సంస్థలు సమకూర్చనున్నట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

ఉమెన్స్ డే..గ్రీన్ ఇండియా పోస్టర్ ఆవిష్కరణ

గ్రీన్‌ ఇండియా…మొక్కలు నాటిన హోంమంత్రి

బాబోయ్‌ ఎండలు..జాగ్రత్తలు తప్పనిసరి!

- Advertisement -