తెలంగాణ టూరింజకు అరుదైన గౌరవం..

726
telangana tourism
- Advertisement -

తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది.ప్రపంచ పర్యాటక దినోత్సవం లో భాగంగా ఈ సంవత్సరం అరుదైన రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది తెలంగాణ పర్యాటక శాఖ. గత నాలుగేళ్లు గా తెలంగాణ ప్రభుత్వం వరసగా వివిధ విభాగాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యాటక పురస్కారాలను అందుకుంటుంది.

తెలంగాణ పర్యాటక శాఖ పర్యాటకులకు పర్యటన ప్రదేశాలకు సంబంధించి విస్తృత సమాచారం కోసం రూపొందించిన ” ఐ ఎక్స్ ప్లోర్ తెలంగాణ ” అనే మొబైల్ యాప్ కు అవార్డు లభించింది.

దీంతో పాటు ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం అనే విభాగం లో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రి జాతీయ స్థాయి పర్యాటక అవార్డులను గెలుచుకుంది. ఐ ఎక్స్ ప్లోర్ తెలంగాణ అనే మొబైల్ యాప్ కు ఐటీ యొక్క అత్యంత విన్నూత్న ఉపయోగం – సోషల్ మీడియా / మొబైల్ అనువర్తనం, వెబ్ సైట్ విభాగంలో తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన యాప్ కు అందరి ప్రశంసల తో పాటు అరుదైన అవార్డును గెలుచుకుంది.

- Advertisement -