వేశ్యలపై భారతీయుల దాడి..జైలు శిక్ష!

5
- Advertisement -

సింగపూర్‌లో ఎంజాయ్ చేద్దామని వెళ్ళి, వేశ్యలపై దాడి చేశారు ఇద్దరు భారతీయులు. వీరికి 5 సంవత్సరాల 1 నెల జైలు శిక్షతో పాటు 12 బెత్తం దెబ్బలు శిక్ష విధించింది సింగపూర్ కోర్టు.

ఏప్రిల్ 24న వేసవి సెలవులను ఎంజాయ్ చేద్దామని సింగపూర్‌కు వెళ్లారు ఆరోక్కియసామి డైసన్(23), రాజేంద్రన్(27). అక్కడ గుర్తు తెలియని వ్యక్తి ద్వారా ఇద్దరు వేశ్యల దగ్గరికి వెళ్లారు ఈ ఇద్దరు యువకులు.

డబ్బుల కోసం ఇద్దరు వేశ్యలపై దాడి చేసి, హోటల్ రూంలో చోరికి పాల్పడ్డారు డైసన్, రాజేంద్రన్. సమాచారం అందుకుని ఇద్దరిని అరెస్ట్ చేసి, ఇటీవల కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. తమ దగ్గర డబ్బులు లేనందునే ఇలా చేశామని యువకులు చెప్పగా.. ఇద్దరికి 5 సంవత్సరాల 1 నెల జైలు శిక్షతో పాటు, 12 బెత్తం దెబ్బలు శిక్ష విధించింది సింగపూర్ కోర్టు.

Also Read:ఇన్సురెన్స్ డబ్బుల కోసం..చంపేశారు!

- Advertisement -