రెండు రోజులు భారీ వర్షాలు..

10
- Advertisement -

తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.

శనివారం నాడు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ వెల్లడించింది.

Also Read:టీటీడీకి విరాళాల వెల్లువ

ఆదివారం నాటికి తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది, సోమవారం నాటికి సూర్యకాంతం కనిపించే అవకాశం ఉందని వెల్లడించింది. వచ్చే వారం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వర్షం లేకుండా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని.. విశాఖపట్నంలో శనివారం నాడు మేఘావృత ఆకాశం మరియు తేలికపాటి వర్షం ఉండే అవకాశం ఉంది అని వెల్లడించింది.

- Advertisement -