ఏపీలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా ఇది అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది.
దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ.
Also Read:వీరమల్లు రిలీజ్…చంద్రబాబు ట్వీట్
మరోవైపు తెలంగాణలో భారీ వర్షాలతో కరీంనగర్ నీట మునిగింది. ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్ పరిధిలోని రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. ఈ రోజు ఉదయం మూడు గంటల పాటు 7 సెం.మీ వర్షం కురియగా కరీంనగర్ రోడ్లన్ని చెరువలను తలపిస్తున్నాయి.

