కొత్త వివాదంలో ట్విట్టర్..

195
Twitter
- Advertisement -

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ మరోమారు కొత్త వివాదంతో తెరపైకి వచ్చింది. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వంతో ట్విట్టర్ సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. భారత కొత్త ఐటీ చట్టం అమలుకు మొండికేస్తున్న ట్విట్టర్ ఇప్పటికే పలు మినహాయింపులు కోల్పోయింది. ఈ క్రమంలో కేంద్రం, ట్విట్టర్ మధ్య పోరు నడుస్తోంది.

తాజాగా ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ కొత్త వివాదంలో చిక్కుకుంది. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలను ప్రత్యేక దేశంగా పేర్కొంటూ, భారతదేశ మ్యాప్‌ను తప్పుగా చూపించింది. గతంలో ట్విట్టర్ లేహ్ ను చైనాకు చెందిన భూభాగం అని చూపించడం తెలిసిందే.

తాజాగా కశ్మీర్ ను దేశంగా చూపిస్తూ రూపొందించిన మ్యాప్ ను ట్విట్టర్ లోని ట్వీప్ లైఫ్ విభాగంలో పొందుపరిచారు. దీన్ని ఓ నెటిజన్ గుర్తించడంతో ఈ తప్పిదం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ తీరుపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ట్విట్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్రం తీవ్రస్థాయిలో స్పందించే అవకాశాలున్నాయి.

- Advertisement -