ట్రెండింగ్‌లో #GoogdByeTwitter!

192
- Advertisement -

ట్విట్టర్‌ను అలా సొంతం చేసుకున్నారో లేదో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు కొత్త సీఈవో ఎలాన్ మస్క్‌. ఖర్చుల తగ్గింపులో భాగంగా ఉద్యోగాల కోతపై దృష్టిసారించిన మస్క్‌..అనుకున్నదే తడవుగా వేలాది ఉద్యోగులను తొలగించారు. మరికొంతమంది ఉద్యోగులకు రాజీనామా చేయాలంటూ మెయిల్స్ పంపించారు.

దీంతో ఒక్కొక్కరిగా తమ ఉద్యోగాలను వదిలి వెళ్తుండగా త్వరలోనే ట్విట్టర్‌ షట్‌డౌన్ అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ Twitter 2.0 కోసం రెడీగా ఉండాలని, హార్డ్‌కోర్ వర్క్ కల్చర్‌కు కట్టుబడి ఉండాలని, మూడు నెలల వేతనంతో సెలవు పెట్టాలని కోరారు మస్క్‌.

దీంతో చాలామంది ఉద్యోగులు రాజీనామాలకే మొగ్గు చూపారు. ట్విట్టర్ ఉద్యోగుల సామూహిక రాజీనామాలతో నవంబర్ 21 వరకు అన్ని ఆఫీసులను మూసివేయాలని, బ్యాడ్జ్ యాక్సెస్‌ను రద్దు చేయాలని మస్క్ ఆదేశించారు. దీంతో యూజర్స్‌లో గందరగోళం నెలకొనగా #GoogdByeTwitter, #RIPTwitter వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -