ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో ఎక్కువశాతం సోషల్ మీడియాలోనే బిజిగా గడిపేస్తున్నారు. ఈమధ్య ట్వీట్టర్ లో ప్రముఖలకు ఎవరికి ఎంత ఫాలోయింగ్ ఉందనే లెక్కలను విడుదల చేసింది. సెలబ్రెటీలు ఎక్కువ మంది చాలా వరకూ ట్వీట్టర్ నే వాడుతుంటార. టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకూ స్టార్లకు ట్వాట్టర్లో మంచి ఫాలోయింగ్ హే ఉంది. అయితే సెలబ్రెటీల ఫాలోవర్లలో అన్నిఅకౌంట్లు నిజం కాదని అందులో కొన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయని తేల్చిచెప్పింది. ప్రధాని మోడీ నుంచి సినిమా సెలబ్రెటీల వరకూ ఒక్కొక్కరికి ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారని ఇటివలే ట్వీట్టర్ ఒక లిస్ట్ ను విడుదల చేసింది.
ట్విట్టర్ విడుదల చేసిన లిస్ట్ లో టాలీవుడ్ లో చూస్తే అక్కినేని సమంత మొదటి ప్లేస్ ఉంది. ఆమె ఫాలోవర్లలో 68శాతం మాత్రమే నిజమైన అకౌంట్లు ఉన్నాయని ట్వీట్టర్ తెలిపింది. రెండవ స్ధానంలో మహేశ్ బాబు 51శాతం నిజమైన ఫాలోవర్లను కలిగిఉన్నారు. తర్వాత రానా దగ్గుబాటి 53 శాతం, అక్కినేని నాగార్జున 54 శాతం. తర్వాత దర్శకుడు రాజమౌళి ట్వీట్టర్ లో మాత్రం 72శాతం నిజమైన ఫాలోవర్లు ఉన్నారని ప్రకటించింది. ఎన్టీఆర్ ఫాలోవర్స్ లో 65 శాతం ఉండగా, స్టైలిష స్టార్ అల్లు అర్జున్ ట్వీట్టర్ లో 49శాతం లోయేస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు.
ఇక బాలీవుడ్ విషయానికొస్తే షారూఖ్ ఖాన్ 35 మిలియన్ల ఫాలోవర్లతో ట్వీట్టర్ ఖాతాలో టాప్ లో కొనసాగుతున్నారు. ఇంతమంది ఫాలోవర్స్ ఉండగా అసలు ఆయన ఒరిజినల్ ఫాలోవర్స్ మాత్రం 48 శాతం మంది మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా అతి తక్కువ ఫాలోవర్స్ కూడా ఆయనకే ఉన్నారంట. అమితాబ్ బచ్చన్ 62శాతం, కండల వీరుడు సల్మాన్ ఖాన్ 50శాతం, దీపికా పదుకునే 67శాతం , హృతిక్ రోహన్ 56శాతం, అమీర్ ఖాన్ 68శాతం ప్రియాంక చోప్రా 71శాతం ఫాలోవర్స్ లో ముందు వరుసలో ఉంది.