మరోసారి నిరాశపర్చిన రోహిత్..

236
rohith
- Advertisement -

టెస్టుల్లో రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఆడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ రోహిత్ నిరాశపర్చాడు. కేవలం ఒకే ఒక రన్‌ కొట్టి పెవిలియన్ బాటపట్టాడు.

నాలుగో రోజు లంచ్‌ విరామానికి 5 వికెట్లు నష్టపోయి 260 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ పుజారా, అజింక్య రహానే అర్ధసెంచరీలతో రాణించారు. పుజారా 71 ,రిషబ్‌ పంత్‌(28) అవుటయ్యాడు. 301/6 స్కోరుతో టీమిండియా ఆట కొనసాగిస్తోంది. రహానే(68), అశ్విన్‌(5) క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు 316 పరుగుల ఆధిక్యంలో భారత్‌ ఉంది.

తొలి ఇన్నింగ్స్‌లోనూ రోహిత్ నిరాశపర్చాడు. ఇక టెస్టు మ్యాచ్‌‌లో రోహిత్ శర్మకి టీమిండియా మేనేజ్‌మెంట్ తుది జట్టులో చోటివ్వడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఈ టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ నిన్న 12 మందితో కూడిన భారత్ జట్టుని ప్రకటించగా.. హనుమ విహారిపై వేటు వేసిన టీమిండియా తుది జట్టులో రోహిత్‌కి అవకాశమిచ్చింది. దీంతో టెస్టుల్లో మెరుగైన రికార్డు లేని రోహిత్‌కి ఎలా అవకాశమిస్తారు..? అని సోషల్ మీడియాలో అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

- Advertisement -