త్వరలో ట్విటర్‌లో వెరిఫైడ్ సర్వీసులు

205
- Advertisement -

ప్రపంచకుబేరుడు ట్విట్టర్‌లో వచ్చే వారం తాత్కాలికంగా వెరిఫైడ్ సర్వీసులను ప్రారంభించనున్నట్టు తెలిపాడు. ట్వీటర్ కొనుగోలు చేసినప్పుటి నుంచి నిత్యం వార్తల్లో నిలిచే ఎలన్ తాజాగా మరోసారి నిలిచారు. వెరిఫైడ్ సర్వీసుల సేవల పునరుద్దరణలో కీలక మార్పు తీసుకొస్తున్నట్టు ప్రకటించాడు. వెరిఫైడ్ ఖాతాలకు వేర్వేరు రంగుల్లో టిక్ మార్క్‌లను కేటాయిస్తున్నట్టు వెల్లడించారు.

వ్యక్తులు సంస్థలు ప్రభుత్వ ఖాతాలకు స్పష్టమైన తేడా ఉండే విధంగా ఈ మార్పులను తీసుకువస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే మూడు రకాల టిక్‌లను ఉపయోగిస్తామన్నారు. కంపెనీలకు బంగారు రంగు కల టిక్‌ మార్క్‌ ప్రభుత్వ ఖాతాలకు బూడిద రంగు టిక్‌ మార్క్‌ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాలకు నీలం రంగు టిక్‌మార్క్‌లు ఉంటాయని పేర్కొన్నాడు. గతంలోనే తెలిపినట్టుగా బ్లూటిక్‌ మార్క్‌ కోసం 8డాలర్లు చెల్లించాలని తెలిపిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

మెట్రో ప్రయాణికులకు శుభవార్త…

ఈయేడాది ఇదే లాస్ట్‌ ప్రయోగం:ఇస్రో

చౌక ధరకే 5G ఫోన్స్‌…ఇవే!

- Advertisement -