ఎట్టకేలకు దిగొచ్చిన ట్విట్టర్..

230
twitter
- Advertisement -

ఎట్టకేలకు దిగొచ్చింది ట్విట్టర్. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్‌ను పాటించేందుకు సిద్ధమని వెల్లడించింది.భారత చట్టాలకు కట్టుబడి ఉండేందుకు అంగీకరిస్తున్నట్లు ప్రకటిస్తూ.. అందుకు కొంత సమయం కావాలని కోరింది.

కొత్త ఐటీ నిబంధనల అమలుకు సంబంధించిన ప్రతీ చర్యను తీసుకుంటున్నామని…ఈ మేరకు భారత్‌లో గ్రీవెన్స్‌, నోడల్‌ అధికారులను నియమించినట్లు తెలిపింది. చీఫ్‌ కంప్లయన్స్‌ ఆఫీసర్‌ను నియమించే ప్రక్రియ తుది దశలో ఉందని స్పష్టం చేసింది. మహమ్మారి విజృంభిస్తుండడంతో వెంటనే ఏర్పాట్లు చేసుకోవడం సాధ్యం కాలేదని వివరించింది.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలను పాటించేందుకు ససేమిరా అంటూ మొండికేసింది ట్విట్టర్. పలుమార్లు లేఖ ద్వారా ట్విట్టర్‌కు సూచించిన ఆ సంస్థ వెనక్కి తగ్గలేదు. దీంతో చివరి అవకాశం ఇస్తూ ఘాటుగా లేఖ రాయగా వెనక్కితగ్గింది ఆ సంస్థ.

- Advertisement -