కరూర్‌లో జరిగిన భయానక తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోవడంతో వ్యవహారం మరింత సీరియస్‌గా మారింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేపట్టింది. ఈ కేసులో భాగంగా టీవీకే పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీబీఐ విచారణకు హాజరుకావాల్సిందిగా విజయ్‌కు మూడు రోజుల క్రితమే నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
విచారణలో భాగంగా విజయ్ నుంచి కీలక సమాచారం రాబట్టాలని సీబీఐ భావిస్తోంది. అయితే ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. ఈ ప్రచారంపై ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు. విజయ్ మాత్రం చట్టానికి పూర్తి సహకారం అందిస్తానని, నిజాలు వెలుగులోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. దర్యాప్తు పారదర్శకంగా, వేగంగా సాగాలని ఆదేశించింది. ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ, సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Also Read:లైంగిక దాడి..కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే అరెస్ట్!

