గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన టీవీ9 డైరెక్టర్ సింగారావు

519
green
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ గ్రీన్ ఛాలెంజ్ కు అపూర్వ ఆదరణ లభిస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగస్వామయ్యం అయి మరో ముగ్గురికి సవాల్ విసిరారు. మై హోం గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు టీవీ9 ఛానెల్ హోల్ టైమ్ డైరెక్టర్ జి. సింగారావు.

ఈసందర్భంగా టీవీ9 ఆఫీసులో మూడు మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ సవాల్ స్వీకరించాల్సిందిగా కోరారు. ఎం. నాగేశ్వర్ రావు(ఈనాడు ఎడిటోరియల్ హెడ్), ఇ. రఘుబాబు(ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ భక్తి టీవీ), కె. శ్రీనాథ్ (మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అలెఖ్య హోమ్స్) ముగ్గురికి సవాల్ విసిరారు. ఇంత అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కు శుభాకాంక్షాలు తెలిపారు.

tv9

- Advertisement -