ఎంపీ సంతోష్‌తో కలిసి మొక్కలు నాటిన సినీ తారలు..

32

పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన లభిస్తుంది. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లోని జీహెచ్‌ఎంసీ పార్క్‌లో నిర్వహించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా సినీ,టీవీ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త,రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొని సినీ,టీవీ ఆర్టిస్టులతో కలిసి మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సంపత్ నంది, కాదంబరి కిరణ్,టీవీ ఆర్టిస్ట్ మీనా,బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మానస్,కాజల్,జబర్దస్త్ రాకేష్,అదిరే అభి,టీవీ ఫెడరేషన్ ఫౌండర్ నాగ బలసూరేష్ కుమార్,టీవీ ఆర్టిస్ట్స్ సన,మినా, వైభవ్ సూర్య ,రాజేంద్ర ,టార్జాన్, డైరెక్టర్స్ పులి వాసు, ప్రసాద్,దీప్తి బాజ్ పెయ్ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.