రజినీకి ముద్దు పెట్టేసింది…

188
TV Actress Chaitra Reddy Kiss to Rajinikanth
- Advertisement -

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ 161వ చిత్రం ‘కాలా’. ఈ సినిమాకి ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ‘కబాలి’ తర్వాత మరోసారి యువ దర్శకుడు పా రంజిత్ డైరెక్షన్‌లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మూవీ కాలా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో రజినీకాంత్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ షూటింగ్ సందర్భంగా..రజినీకాంత్ కు ఓ అమ్మాయి స్ట్రాంగ్‌గా ముద్దిచ్చేయడం సెన్సేషన్ గా మారింది. తనకంటే దాదాపు 3 రెట్ల వయసు ఉన్న ఈ సూపర్ స్టార్ కు.. ఓ సీరియల్ యాక్ట్రెస్.. బుగ్గమీద గాట్టి ముద్దు ఇచ్చేసింది. ప్రస్తుతం కాలా కరికులన్ సినిమా షూటింగ్ లో రజినీకాంత్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ సందర్భంగా.. జీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ అయిన చైత్రా రెడ్డి.. అక్కడకు వచ్చింది. రజినీకాంత్ తో ఫోటో దిగాలన్న తన కోరికను వెలిబుచ్చింది. అంతే కాదు.. ఆయనకు బుగ్గపై ఓ ముద్దిస్తూ ఫోటో దిగాలన్న తన కోరికను కూడా చెప్పింది. దీనికి నవ్వుతూనే సరే అన్నారు రజినీ.

TV Actress Chaitra Reddy Kiss to Rajinikanth

అయితే.. ఆయన కూడా ఊహించని స్థాయిలో.. గట్టిగా బుగ్గను ముద్దాడేసింది చైత్రా రెడ్డి. సూపర్ స్టార్ తన సహజ శైలిలో నవ్వుతూనే ఉన్నా.. ఆ ముద్దు పెట్టేటపుడు అమ్మడి తన్మయత్వం చూస్తే.. ఎంతటి అభిమానమో అనిపించక మానదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. అందుకు కారణం మాత్రం చైత్రా రెడ్డి ఫేస్ లో కనిపిస్తున్న ఫీలింగ్సేనట.

- Advertisement -