భయపడుతున్న జక్కన్న..!

205
- Advertisement -

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద తనకు జాతీయ అవార్డ్ ఇవ్వడం తన బాధ్యతను రెట్టింపు చేసిందన్నారు దర్శకుడు రాజమౌళి. ఆదివారం సాయంత్రం శిల్పకళావేదికలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ‘అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డ్ 2017’ అందుకున్నారు రాజమౌళి.

 rajamouli speech at anr awrd ceremony

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘దివంగత అక్కినేని నాగేశ్వర్ రావులాంటి మహానుభావుడి పేరుమీదున్న జాతీయ అవార్డును నాకు ప్రదానం చేశారు.. నేను అందుకు అన్ని విధాలా అర్హుడనా..? అనే ఆలోచన నాలో మొదలైంది’అని అన్నారు. అక్కినేని జాతీయ పురస్కారం అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని, అదేసమయంలో మరోవైపు భయంగా కూడా ఉందన్నారు రాజమౌళి. ఇలాంటి అవార్డులు తీసుకుంటున్నప్పుడు రెక్కలు ఇచ్చినట్లు ఉంటుందన్నారు.

కానీ నాగార్జున తన భుజస్కందాలపై పెద్ద భారాన్ని పెట్టారని, అక్కినేని అవార్డుకు మరింత గౌరవం తెచ్చేందుకు తన శాయశక్తులా కష్టపడతానని చెప్పారు. అదేసమయంలో 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -