బుట్టబొమ్మ @ 250 మిలియన్స్

237
buttabomma song
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’. 2020 సంక్రాతి కానుకగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకురాగా మ్యూజికల్‌గానే కాదు బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఈ మూవీ. బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

ముఖ్యంగా ఈ సినిమాలో రాములో రాములా,బుట్ట బొమ్మ సాంగ్‌కి స్టెప్పులేయని వారుండరూ. అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి ఈ సాంగ్స్‌. ముఖ్యంగా బుట్టబోమ్మ సాంగ్ యూ ట్యూబ్‌ని షేక్ చేసింది.

తాజాగా బుట్టబొమ్మ సాంగ్ ప్రపంచ రికార్డ్ సాధించింది. వరల్డ్ వైడ్‌గా అత్యంత ప్రాచుర్యం పొందిన 100 వీడియో సాంగ్స్‌లో ఈ పాట 15వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 250 మిలియ‌న్స్‌‌కి పైగా వ్యూస్ రాబ‌ట్టి స‌రికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ పాట 2 మిలియన్ లైక్స్ మార్కుకు దగ్గరగా ఉంది.

- Advertisement -