ద‌ర్శ‌కుడైన బుల్లితెర యాక్ట‌ర్‌..

200
TV Actor Prabhakar turns director
- Advertisement -

వి-4 మూవీస్ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా తీసిన నెక్ట్స్ నువ్వే సినిమా మరో 3 రోజుల్లో విడుదలకానుంది. మొదట్నుంచి ఈ సినిమాను డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్న యూనిట్.. ఇప్పుడు ప్రచారాన్ని మరింత పెంచింది. కామెడీ-హారర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా మరింత కొత్తగా ఉంటుందంటున్నారు మేకర్స్. ఆది హీరోగా నటించిన ఈ సినిమాతో తమ బ్యానర్ కు మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు.

ఐతే ఈ సినిమా విడుదల కాకముందే దర్శకుడిగా ఇంకో రెండు అవకాశాలు వచ్చాయని.. అందులో ఒక సినిమా పూర్తి కావస్తోందని ప్రభాకర్ చెప్పడం విశేషం.దర్శకుడు మారుతి ప్రొడక్షన్లో ఓ సినిమా చేస్తున్నానని.. ఆ సినిమా 75 శాతం పూర్తయిందని అతను వెల్లడించాడు. అలాగే మరో సినిమాకు స్క్రిప్టు పూర్తయిందని.. జ్నానవేల్ రాజా నిర్మాణంలో ఆ సినిమా ఉంటుందని అతను చెప్పాడు. ‘నెక్స్ట్ నువ్వే’ నిర్మాత బన్నీ వాసుకు మారుతి క్లోజ్. ఇక జ్నానవేల్ రాజా ‘నెక్స్ట్ నువ్వే’లో నిర్మాణ భాగస్వామి. ఇలా వీళ్లిద్దరూ ప్రభాకర్ టాలెంట్ చూసి తమ బేనర్లలో ఛాన్సులిచ్చారట.

- Advertisement -