నితిన్‌తో లవ్..క్లారిటీ ఇచ్చేసింది..!

328
Megha Akash about Nithin..!
- Advertisement -

టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతోన్న  హీరో  నితిన్. ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో  సినిమా చేస్తున్నాడు నితిన్.  ఈ సినిమాలో నితిన్‌ సరసన..లై బ్యూటీ మేఘఆకాశ్ నటిస్తోంది.  ఈ నేపథ్యంలో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని టీటౌన్‌లో పుకార్లు షికార్ చేస్తున్నాయి.

ఈ వార్తలపై తాజాగా మేఘా ఆకాశ్ స్పందించింది. నేను నితిన్ ప్రేమలో ఉన్నామనే వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చింది. మాపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే కుండబద్దలు కొట్టింది. నితిన్ , మేఘా ఆకాశ్ లపై ఇలాంటి ప్రచారం జరగడానికి కారణం లై సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోమని డైరెక్టర్ హనూ రాఘవపుడికి నితిన్ రికమండ్ చేయడమేనట.

Megha Akash about Nithin..!
అంతేగాదు నితిన్‌తో ప్రేమ వ్యవహారం నడస్తుండటం వల్లే మేఘా వేరే సినిమాలు ఒప్పుకోలేదని ప్రచారం జరిగింది.  దీంతో స్పందించిన మేఘా…దయచేసి  తప్పుడు ప్రచారం చేయోద్దని కోరింది . ప్రస్తుతం నితిన్‌తో కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ కన్ఫార్మ్‌ కాలేదు.

- Advertisement -