మొక్కలు నాటిన బుల్లి తెర నటుడు కౌశిక్ శ్రీకృష్ణ

36
actor

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బుల్లి తెర నటుడు రవికిరణ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు బుల్లి తెర నటుడు కౌశిక్ శ్రీకృష్ణ.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రుని ఒక నూలు పోగు లాగా మనం నాటే ఈ మొక్కలు వాతావరణ కాలుష్యానికి తగ్గించటం కోసం ఉపయోగ పడుతుంది అని. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు.

ఈ సందర్భంగా ఒక కవితను పాడటం జరిగింది.
“నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మలు కొమ్మ కొమ్మకు విరబూసి వేలాదిగా కాయాలి బంగారు కాయలు వాటిని తినాలి మన పిల్ల కాయలు”.ఈ సందర్భంగా తన తోటి మిత్రులు రితేష్; జాకీర్ ;సుమిత్ లను ఈ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.