పసుపు ఇలా వాడితే..రోగాలు మటాష్!

50
- Advertisement -

పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలు మెండుగా ఉంటాయి. అందుకే పసుపును ఆయుర్వేదంలో ఎన్నో రోగాలకు యాంటీ బయోటిక్ లా ఉపయోగిస్తారు. శరీరంలో ఎక్కడైనా గాయాలు అయినప్పుడు ప్రధమ చికిత్సగా పసుపును ఆ గాయాలకు రాస్తే.. ఇందులో వుండే విటమిన్ కె కారణంగా రక్తస్రావం ఆగిపోతుంది. ఇంకా చర్మ సౌందర్యంలో పసుపు చేసే మేలు గురించి ఎంత చెప్పిన తక్కువే. ప్రతిరోజూ మొఖానికి పసుపు రాసుకోవడం వల్ల మొఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. అంతే కాకుండా మొఖం నిగారింపు సొంతం చేసుకుంటుంది.

ఇదిలా ఉంచితే ఈ వర్షాకాలంలో వచ్చే సాధారణ వ్యాధులను తగ్గించడంలో పసుపు ముఖ్య భూమిక పోషిస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో వాతావరణ మార్పుల కారణంగా జలుబు, దగ్గు, జ్వరం, నీరసం వంటి సమస్యలు తరచూ వేధిస్తుంటాయి. అలాంటప్పుడు ఒక స్పూన్ తేనెలో కొద్దిగా కొబ్బరి నూనె మరియు చిటికెడు పసుపు కలిపి సేవిస్తే, జలుబు, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు దూరమౌతాయి. ఇంకా కొబ్బరిపాలు, ఒక స్పూన్ తేనె, చిటికెడు పసుపు కలిపి తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా ఎలాంటి సీజనల్ వ్యాధులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు స్టామినా పెరుగుతుంది. ఇంకా పసుపులో ఉండే ప్రత్యేక గుణాలు ఎముకల క్యాన్సర్ ను కూడా తగ్గిస్తాయని పలు పరిశోదనల్లో వెల్లడైంది. ఇంకా పసుపును ప్రతిరోజూ పాలలో కలుపుకొని తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతే కాకుండా నాడీ వ్యవస్థ కూడా క్రమబద్దీకరించబడుతుంది.

Also Read:తెలంగాణ బీజేపీ..ఎవరి దారి వారిదే?

- Advertisement -