పసుపుకు మద్దతు ధర,పుసుపు బోర్డు ఏర్పాటుకోసం కొంతకాలంగా ఆందోళన చేస్తున్న నిజామాబాద్ రైతులు వారణాసిలో ధర్నాకు దిగారు. నామినేషన్ వేసేందుకు పోలీసులు అనుమతించడం లేదని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నామినేషన్ వేసేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ,తమిళనాడుకు చెందిన రైతులు వారణాసి సర్క్యూట్ హౌజ్ ఆందోళనకు దిగారు.
తమ సమస్యను జాతీయ స్ధాయిలో వినిపించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోటీచేస్తున్న వారణాసిలో నామినేషన్ వేసేందుకు పెద్దసంఖ్యలో రైతులు ఇవాళ ఉదయమే వారణాసి చేరుకున్నారు.
రైతులు నామినేషన్లు వేసేందుకు వీల్లేకుండా స్ధానిక బీజేపీ నేతలు, పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తుండగా స్ధానికుల నుండి మద్దతు లభిస్తోంది. నామినేషన్లకు ప్రతిపాదకులుగా ఉంటామని వారణాసి రైతులు అండగా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా పసుపు బోర్డులను ఏర్పాటుచేయాలని డిమాండ్‌తో రైతులు పెద్ద ఎత్తున నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.