లంచం అడిగితే…రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు

215
lingaiah

లంచం అడిగిన అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టించారు రైతు. హుజూర్ నగర్ మండలం బూరుగడ్డకు చెందిన రైతు కారంగుల లింగయ్య గరిడేపల్లి మండలం కుతుబ్‌ షా పురంలో భూమి కొనుగోలు చేశారు. అయితే అదే భూమిని లింగయ్యకు తెలియకుండా మరొకరికి రిజిస్టర్ చేశారు. దీంతో అధికారులను నిలదీసి అడిగారు లింగయ్య.

రికార్డును సరిచేసేందుకు రూ 20 వేలు ఖర్చు అవుతుందని డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. దీంతో ఏసీబీని ఆశ్రయించారు లింగయ్య. రైతు ఫిర్యాదుతో సూర్యపేట జిల్లా గరిడేపల్లి మండలం తహశీల్దార్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు అధికారులు. లింగయ్య నుంచి లంచం తీసుకుంటున్న సత్యనారాయణను రెడ్ హ్యాండెడ్‌ పట్టుకున్నారు అధికారులు.