ఎంపీ అరవింద్‌పై పసుపు రైతుల ఆగ్రహం..

244
turmeric farmers
- Advertisement -

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పంటకు కనీమ మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఫస్ట్ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో రైతులు ఆందోళన బాట పట్టారు. పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ అరవింద్‌కు వ్యతిరేకంగా రైతులు నినదించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకువస్తామని చెప్పి.. గెలిచిన తర్వాత ఎంపీ ముఖం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేసి, రైతులతో కలిసి ఆందోళనల్లో పాల్గొనాలన్నారు. పసుపు మద్దతు ధర కల్పించే వరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పసుపు రైతులకు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మద్దతు ప్రకటించి, ఆందోళనలో పాల్గొన్నారు.

- Advertisement -