బీజేపీ ఎంపీ అరవింద్‌పై పసుపు రైతుల ఆగ్రహం..

49
MP Arvind

ఈ రోజు నిజామాబాద్ జిల్లా వేల్పుర్ మర్కెట్ కమిటీలో పసుపు రైతుల మీడియా సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు తేలేకపోయిన ఎంపీ అరవింద్ వెంటనే రాజీనామా చేయలని డిమాండ్ చేశారు. ఎంపీ అరవింద్ రైతుల మద్యలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

రైతులను మోసం చేసి,తప్పించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని రైతులు దుయ్యబట్టారు. స్పైస్ బోర్డు అవసరం లేదు ,పసుపు బోర్డు సాధించేవరకు పోరాటం ఆపేది లేదని వారు డిమాండ్‌ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తేకుంటే తగిన రీతిలో బుద్ధిచెప్తామని రైతులు హెచ్చరించారు.