ఎంపీ అరవింద్‌కు పసుపు రైతుల సెగ..

77
- Advertisement -

పల్లె పల్లెనా మళ్లీ పసుపు మంటలు రగిలాయి. బీజేపీ ఎంపీ దర్శపురి అరవింద్‌పై నిజామాబాద్‌ జిల్లాలోని ఆలూరు,దేగం గ్రామాల రైతులు కోపంతో రగిలిపోతున్నారు. మంగళవారం జిల్లాలోని పలు మండలాల్లో ఎంపీ అరవింద్‌ పర్యటిస్తుండగా.. పసుపు రైతులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు తేకుండా మోసం చేశాడని రైతులు మండిపడ్డారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన అరవింద్ మాట తప్పిన మోసగాడు.. రైతు ద్రోహి అని ఎమ్మెల్యే ఎ జీవన్ రెడ్డి విమర్శించారు. నయవంచక ఎంపీ అరవింద్‌ను మా గ్రామాల్లోకి రానివ్వం. అడుగడుగునా అడ్డుకుంటాం.. పసుపు బోర్డు ఎందుకు తేలేదని నిలబెట్టి అడుగుతం.. ఒరగ బెట్టి కడుగుతం అని మండిపడ్డారు.

- Advertisement -