బీజేపీ మ్యానిఫెస్టోను దహనం చేసిన పసుపు రైతులు..

302
Turmeric farmers
- Advertisement -

నిజామాబాద్ జిల్లా అర్మూర్‌ పట్టణ కేంద్రంలో తమిళనాడు బీజేపీ మ్యానిఫెస్టో ప్రతులను పసుపు రైతులు దహనం చేశారు. తమిళనాడులో పసుపు బోర్డు, 15 వేల మద్దతు ధర ప్రకటిస్తామని మేనిపెస్టోలో చేర్చడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయలేమని ఎంపీ సురేష్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే తమిళనాడులో ఎలా ఏర్పాటు చేస్తారని పసుపు రైతులు మండిపడుతున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి, ఎంపీకి తగిన గుణపాఠం చెబుతామని పసుపు రైతులు మండిపడ్డారు.

- Advertisement -