ప్రకృతి బీభత్సం ధాటికి టర్కీ అతలాకుతలం అవుతోంది. వరుస భూకంపాలతో అంతులేని విషాదం నెలకొనగా వేల సంఖ్యలో ప్రజలు మృత్యవాత పడ్డారు. అధికారికంగా మృతుల సంఖ్య 7800గా ప్రకటించిన దాదాపు 20 వేల మందికి పైగా మృతిచెంది ఉంటాని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. శిథిలాల తొలగింపులో ఎక్కడ చూసిన మృతదేహాలే బయటపడుతుండటంతో ప్రజల బాధ చెప్పలేని విధంగా ఉంది.
టర్కీలో వరుస భూప్రకంపనలతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. టర్కీ, సిరియాలో ఎటు చూసిన కూలి పోయిన బిల్డింగుల్లే దర్శనమిస్తున్నాయి. రెండు దేశాల్లోని ప్రాంతాలు శవాల దిబ్బగా మారింది.
భూకంపాల ధాటికి నగరాల్లోని పలు అపార్ట్ మెంట్లు కుప్పకూలాయి. శిథిలాల కింద వేలాది మంది జనం చిక్కుకుపోయారు. వారిని క్షేమంగా బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగతుున్నాయి. రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది.
ఇవి కూడా చదవండి..