జగన్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం- తులసిరెడ్డి

207
- Advertisement -

రైతుల పండుగ అయిన సంక్రాంతి పండుగ రోజులలో రైతుల ముఖాల్లో సంతోషం లేకుండా చేసింది జగన్ ప్రభుత్వం అని ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం కడప జిల్లా,వేంపల్లిలోని తులసిరెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. జగన్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని.. రైతు భరోసా పథకం క్రింద ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏడాది రూ.5 వేలు ప్రభుత్వం కోత పెట్టిందన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతులు నిరాశా కేంద్రాలుగా మార్చారు. రైతు రుణమాఫీ పథకం క్రింద రూ.8 వేల కోట్లు ఎగ్గొట్టి రైతుల నోట్లో మట్టికొడుతూ పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో దారుణంగా వైఫల్యం చెందిందని తులసిరెడ్డి విమర్శించారు.

సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టి , పావలా వడ్డీ పథకానికి పాడే కట్టిందని.. రాయితీపై వ్యవసాయ పరికరాల పథకానికి స్వస్తి పలికి సబ్సిడీపై బిందు, తుంపర సేద్యానికి తిలోదకాలిచ్చి ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అందడంలో విఫలమై వ్యసాయమోటర్లకు మీటర్లు రైతుల మెడలకు ఉరిత్రాల్లుగా మారాయన్నారు. రైతుల చేతులకు సంకెళ్ళు వేసిన రైతు దుష్మన్ ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వమైందని..రైతు నరేంద్ర మోడీపై చెప్పు ఎత్తి జైలుకు పంపించిన రైతు వ్యతిరేక ప్రభుత్వం. రైతుల ఆత్మహత్యల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ది మూడో స్థానం ఉందిని దయ్యబట్టారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని తులసి రెడ్డి మండిపడ్డారు.

- Advertisement -