సినిమా టికెట్ రేట్లు తగ్గించాలని ఎవరు కోరలేదు..

163
- Advertisement -

తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డికోసం అన్నట్లున్నాయి సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అని ఏపీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఎద్దేవ చేశారు. ఆదివారం ఆయన కడప జిల్లా వేంపల్లెలోని తన నివాసంలో నిర్వహించి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సినిమా టికెట్ల ధరలు తగ్గింపుపై జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. తాటి చెట్టు ఎక్కింది తాటి కల్లు కోసం,సాకు మాత్రం దూడ గడ్డికోసం అన్నట్లుంది అన్నారు. సినిమా ధరలు తగ్గించింది సినిమా రంగాన్ని దెబ్బతీయడం కోసం ,ప్రత్యేకించి కొందరు హీరోల ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసం అన్నారు.. సాకు మాత్రం పేదవాడికి అందుబాటు రేట్లులో వినోదం అందించడానికి చెప్పుతున్నారు.

పేదలపట్ల, ప్రజలపట్ల నిజమైన ప్రేమ ఉంటే పెట్రోలు, డీజలు, మధ్యం, ఇసుక,సిమెంట్,నిత్యావసర ధరలు తగ్గించాలన్నారు.చెత్త పన్ను,నీటి పన్ను, ఆస్తి పన్నుల పెంపు జీఓలు రద్దు చేయాలి.OTS క్రింద ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించాలి. తరువాత సినిమా రేట్లు తగ్గించాలన్నారు తులసి రెడ్డి. సినిమా టికెట్ రేట్లు తగ్గించాలని ఎవరు కోరలేదు, ధర్నాలు చేయలేదన్నారు. కరెంటు,డీజిల్‌, పెట్రోలు, మద్యం, ఇసుక, సిమెంటు ధరలు తగించాలని, OTS చెత్త, నీటి,ఆస్థి పన్నుల పెంపు జీఓలను రద్దు చేయాలని నిరసనలు, ధర్నాలు చేస్తున్నారన్నారని తులసి రెడ్డి తెలిపారు.

- Advertisement -