రూమర్స్ నమ్మోద్దు: టక్ జగదీష్ మేకర్స్

94
nani

నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీష్‌. సినిమా విడుదలపై రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతుండగా వాటిని ఖండించారు మేకర్స్‌. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ముగిసి, థియేటర్ల తెరచుకునేందుకు అనుమతి లభించడంతో ఈ సినిమా ఈ నెలాఖరున వస్తుందంటూ జోరుగా ప్రచారం సాగుతుండగా వాటిని నమ్మవద్దని కోరారు మేకర్స్‌. విడుదల తేదీ ఖరారైతే దర్శకనిర్మాతలే ప్రకటిస్తారని తెలిపారు.

నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించగా జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర పోషించారు.