బాలీవుడ్‌లో అగ్రహీరోల సినిమా విడుదల అయ్యిందంటే ఆ హడావుడే వేరుగా ఉంటుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్స్‌గా పేర్కొనే ఖాన్‌ల త్రయంలో ఒకడైన సల్మాన్ ఖాన్ భజరంగీ భాయ్ జాన్.. సుల్తాన్ లాంటి భారీ విజయాలే అందుకున్నాడు. కానీ తాజాగా ఈ కండల వీరుడు నటించిన ట్యూబ్ లైట్ భారీ అంచనాలతో విడుదలైన బాక్సీఫీస్ దగ్గర బోల్తాకొటింది. సినిమా ఇండస్ట్రీలో వరస విజయాలు సాధించినప్పుడు ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. రేంజ్ బాగా పెరిగిపోయిందని ఫీలవనూ వచ్చు. కానీ గట్టి ఎదురుదెబ్బ తగిలాక నేలకు దిగిరావాల్సిందే. అపజయం నేర్పే పాఠం కాస్త చేదుగానే ఉంటుంది. అయితే అలాంటిదే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు రీసెంట్‌గా ఎదురైందని చెప్పుకోవాలి.
కబీర్ ఖాన్ డైరెక్షన్ లో సల్మాన్ ఇంతకు ముందు ఏక్ థా టైగర్ – భజరంగీ భాయిజాన్ సినిమాలు చేశాడు. ఈ రెండూ సూపర్ హిట్లు కావడంతో ట్యూబ్ లైట్ సినిమా రైట్స్ ను భారీ రేట్లకు విక్రయించారు. తీరా సినిమా ఫలితం తేడా కొట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు మునిగిపోయారు. ఏక్ థా టైగర్ సీక్వెల్ గా టైగర్ జిందా హై టైటిల్ తో సల్మాన్ తర్వాత సినిమా చేయబోతున్నాడు. ఈమధ్య సల్మాన్ ఫాంలో ఉండటంతో టైంగర్ జిందా హై సినిమా రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లంతా భారీగానే డబ్బులు పెట్టుబడి పెట్టారు. ట్యూబ్ లైట్ ఫలితం చూశాక అగ్రిమెంట్లను తిరిగి రాయించాలని వారంతా పట్టుపడుతున్నారు. ట్యూబ్ లైట్ డిస్ట్రిబ్యూటర్లను ఆదుకుంటానని ఇప్పటికే సల్మాన్ ప్రకటించినా వారు మాత్రం అగ్రిమెంట్లు మార్చాలస్సిందే అంటున్నారు. టైగర్ జిందా హై శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న స్టార్ టీవీ కూడా పునరాచనలో పడిందని టాక్.
అయితే అన్ని వైపుల నుంచి ఒకే రకమైన డిమాండ్ వస్తుండటంతో సల్మాన్ కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. ఈ మధ్య కాలంలో ఇంత భారీ ఫ్లాపు కళ్లజూడకపోవడంతో ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఆఖరుకు తన రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నాడు. ట్యూబ్ లైట్ మరీ ఇలా కళ్లు మసకబారేంత దెబ్బ కొడుతుందని తను మాత్రం ఎక్స్ పెక్ట్ చేశాడా ఏంటి? మరి నెక్ట్స్ టైగర్ జిందా హై సినిమా పరిస్థితి ఎలావుంటుందో చూడాలి..