సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు కృషి చేస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ… శ్రీవారి ఆశీస్సులతో అందరికీ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీమహావిష్ణువు స్వయంభుగా వెలసిన ప్రదేశం తిరుమల. టీటీడీలో సేవలందించడం ఉద్యోగుల జన్మజన్మల పుణ్యఫలం. హిందూ ధర్మాన్ని పాటించే హిందువులందరికీ టీటీడీ పెద్దదిక్కుగా నిలుస్తోందన్నారు.
ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగా నేడు మనమంతా బానిస సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం అన్నారు. ఆ మహానుభావుల బలిదానాలను నిత్యం మననం చేసుకుంటూ దేశంలో శాంతి, సౌభ్రాతృత్వాలు నెలకొల్పడానికి ప్రతి ఒక్కరు అకుంఠిత దీక్షతో పని చేయాలన్నారు. ఇదే స్ఫూర్తితో టీటీడీలోని అధికారులు, ఉద్యోగులందరూ భక్తుల సేవలో తరించాలని కోరుతున్నానని… హైందవ సనాతన ధర్మవ్యాప్తికి ఆళ్వారుల కాలం నుంచి ఇప్పటివరకు టీటీడీ ఎన్నో సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.
దర్శనంతో సంబంధం లేకుండా కొండ మీదకు వచ్చిన ప్రతి భక్తుడు రెండు పూటల కడుపు నిండా భోజనం చేసే అవకాశం టీటీడీ కల్పించిందన్నారు. సర్వదర్శనంలో స్వామివారి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక చిన్న లడ్డు ఇచ్చే కార్యక్రమం టీటీడీ ప్రారంభించిందని… మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారితో పాటు శ్రీదేవి, భూదేవిని దళితవాడలకు తీసుకెళ్ళి అక్కడే కల్యాణం నిర్వహించి వారికి స్వామివారి ఆశీస్సులు అందజేసే దళిత గోవిందం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవాన్ని, సనాతన హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం వేంకటేశ్వర భక్తి ఛానల్ ఏర్పాటు చేసింది. ఛానల్ కు ప్రస్తుతం 8 కోట్ల మంది వీక్షకులు ఉన్నారన్నారు.
Also Read:గోడకుర్చీ వేస్తే.. ఇన్ని ప్రయోజనాలా!
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంపూర్ణ సహకారంతో వేద పరిరక్షణకు టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రి ఆశీస్సులతో అర్హులైన ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చామని… ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో అర్హులైన ఉద్యోగులందరికీ త్వరలో ఇంటి స్థలాలు ఇస్తాం. ఇందుకోసం 430 ఎకరాల స్థల సేకరణ పూర్తయిందన్నారు.
Also Read:కళ్ళు పొడిబారుతున్నాయా..జాగ్రత్త!