ఆ లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

83
ttd
- Advertisement -

టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శుక్ర, శని, ఆదివారాల్లో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.జూలై 15 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు ఈవో వెల్లడించారు.

స్వామి వారి దర్శనంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను పరిమితం చేసినట్టు చెప్పారు.

ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు హనుమజ్జయంతిని ఆకాశగంగ దగ్గర వైభవంగా నిర్వహిస్తామన్నారు. పేదలకు పిల్లల వివాహాలు ఆర్థికభారం కాకుండా శ్రీవారి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు నిర్వహించే కల్యాణమస్తు కార్యక్రమాన్ని త్వరలో తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు ధర్మారెడ్డి.

- Advertisement -