TTD:10 రోజుల పాటు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

51
- Advertisement -

వైష్ణ‌వాల‌యాల సంప్ర‌దాయాల‌ను పాటిస్తూ తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌రు 23 నుండి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెర‌చి ఉంచి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నభాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం విశిష్ట‌త ఇలా ఉంది. వైకుంఠంలో శ్రీ‌మ‌హావిష్ణువుకు ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవ‌త్స‌రం అని అర్థం. అదేవిధంగా అక్క‌డ ప‌గ‌లు 12 గంట‌లు ఇక్క‌డ 6 నెల‌లు ఉత్త‌రాయ‌ణం, రాత్రి 12 గంట‌లు ఇక్క‌డ 6 నెల‌లు ద‌క్షిణాయణం.

వైకుంఠంలో తెల్ల‌వారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధ‌నుర్మాసంగా పిలుస్తున్నాం. తెల్ల‌వారుజామున బ్ర‌హ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీ‌మ‌హావిష్ణువు దేవ‌త‌ల‌కు, ఋషుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఇది వైకుంఠంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది.

 ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు స‌మానం కాబ‌ట్టి వైష్ణ‌వాల‌యాలలో ఈ 10 రోజుల‌లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకుంటే శ్రీ‌మ‌హావిష్ణువును ప్ర‌త్య‌క్షంగా ద‌ర్శ‌నం చేసుకున్న భాగ్యం క‌లుగుతుంది అనేది న‌మ్మ‌కం. విఐపిలు, ఇత‌ర భ‌క్తులు తొలిరోజైన వైకుంఠ ఏకాద‌శి రోజు మాత్ర‌మే ద‌ర్శ‌నం చేసుకోవాల‌నే తొంద‌ర‌పాటు లేకుండా ప‌ది రోజుల్లో ఏదో ఒక‌రోజు ద‌ర్శ‌నం చేసుకోవ‌డానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.

Also Read:Harishrao:ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన కాంగ్రెస్

- Advertisement -