- Advertisement -
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం రాత్రి స్వామి వారు పాండురంగ స్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులను కటాక్షించారు.రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
సర్వభూపాల అంటే రాజులందరు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు.వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.
Also Read:కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్..
- Advertisement -