- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతుండగా 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 86,793 మంది భక్తులు దర్శించుకోగా 30,254 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 4.47 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తుండగా నవరాత్రి ఉత్సవాల కారణంగా ఈ 10 రోజుల పాటు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకార సేవలను,సెప్టెంబరు 30న లక్ష్మీపూజ, అక్టోబరు 5న అష్టోత్తర శత కలశాభిషేకం సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు సత్య నారాయణ స్వర్ణ పాదాలు విరాళంగా సమర్పించారు.
- Advertisement -