- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా వీకెండ్ కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక నిన్న స్వామివారిని 64,586 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.3.9 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
ఇక తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో గల అక్కదేవతల గుడిలో ఏడుగురు అక్కదేవతలకు పూజ ఘనంగా నిర్వహించారు. అక్కదేవతల గుడిని పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నడకదారి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -