వినాయక నిమజ్జనానికి టీటీడీ సహకారం

52
- Advertisement -

తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమానికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ జరిగే సెప్టెంబరు 22వ తేదీ వినాయక నిమజ్జనాలు జరగకుండా వినాయక నిమజ్జన కమిటీ ప్రతినిధులు, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం శ్రీ కరుణాకర రెడ్డి నగరపాలక సంస్థ, టీటీడీ , ఇతర శాఖల అధికారులు, నిమజ్జన కమిటీతో సమావేశం జరిపారు.ఈ సందర్బంగా శ్రీ కరుణాకర రెడ్డి మాట్లాడుతూ, వినాయక నిమజ్జనం ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగేందుకు గత ఏడాది లాగే ఈ సారి కూడా టీటీడీ వైపు నుండి అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. వినాయక సాగర్ వద్ద భక్తులందరికీ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కుంకుమ, కంకణాలు అందిస్తామని చెప్పారు. తిరుమలలో స్వామి వారి గరుడ సేవ జరిగే రోజునే వినాయక విగ్రహాల ఐదవ రోజు నిమజ్జనం వస్తోందన్నారు.

Also Read:హ్యాపీ బర్త్ డే….పవన్‌

తిరుమలకు గత ఏడాది కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు . అధికార యంత్రాంగం తిరుమలలో ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉన్నందున 5 వ రోజు వినాయక విగ్రహ నిమజ్జనాలు లేకుండా చర్యలు తీసుకోవాలని నిమజ్జన కమిటీ, అధికారులకు కరుణాకర రెడ్డి సూచించారు. వినాయక చవితి సందర్బంగా వినాయక సాగర్ వద్ద టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అవసరమైన మేరకు ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగర పాలక సంస్థ ఈ సారి కూడా అధికారికంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తుందన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం పోలీస్, తుడ, రెవెన్యూ, ఎస్పీడీసీఎల్ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని చైర్మన్ కరుణాకర రెడ్డి చెప్పారు.

Also Read:తురమ్ ఖాన్ లు…ప్రీ రిలీజ్ ఈవెంట్

- Advertisement -