టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ను రాష్ట్ర ప్రభుత్వ జి.ఓ.114 విధివిధానాలకు లోబడి టీటీడీలో అమలుకు నిర్ణయం. వచ్చే బోర్డు సమావేశంలో వివరాలు తెలియజేస్తాం అన్నారు.
– శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఈ నెల 23న అలిపిరి వద్దగల సప్తగోప్రదక్షిణ మందిరంలో ప్రారంభం కానుంది. మొదట కొద్దిమందితో ప్రారంభించి ఆ తరువాత విస్తృత స్థాయిలో స్లాట్ల విధానంలో నిర్వహిస్తారు. ఇందుకోసం టికెట్ ధర రూ.1000/-గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో టికెట్లు కేటాయిస్తారు. ప్రత్యక్షంగా, వర్చువల్‌గా పాల్గొనవచ్చు.
– వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అందించడానికి అవసరమైన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం ఆ భూమిలో రూ.25.67 కోట్లతో గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి టెండరు ఖరారు చేశాం.
అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉద్యోగులకు అదనంగా కేటాయించిన 132 ఎకరాల్లో కూడా గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి రూ.15 కోట్లతో టెండర్లు పిలవడానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. ఇందుకయ్యే ఖర్చును ఉద్యోగులు భరిస్తారు. రిటైర్డ్ ఉద్యోగులు సహా అందరికీ ఇవ్వడానికి ఇంకా భూమి కోరాం. త్వరలో మరిన్ని ఎకరాల వస్తాయి.
– తిరుపతిలో టీటీడీ ఉద్యోగులు నివసిస్తున్న రామ్‌నగర్ క్వార్టర్స్‌లో రూ.6.15 కోట్లతో అభివృద్ధి పనులు చేయడానికి టెండర్లను ఆమోదించాం.
– తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి రెండు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి, బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చక్కటి సేవలు అందించిన రెగ్యులర్ ఉద్యోగులకు రూ.14 వేలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.6,850/- బ్రహ్మోత్సవ బహుమానం అందించాలని నిర్ణయించాం.
Also Read:సురేఖా వాణి కూడా రెడీ అయ్యింది
– మ్యాన్‌పవర్ సర్దుబాటులో భాగంగా ప్రస్తుతం టైపిస్ట్, టెలెక్స్ ఆపరేటర్, టెలిఫోన్ ఆపరేటర్ గ్రేడ్-1 హోదాల్లో ఉన్న ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌గా మార్పు చేసేందుకు ఆమోదం.
– టీటీడీ అన్నప్రసాదం విభాగంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంస్థ తరఫున క్లీనింగ్, సర్వింగ్,లోడింగ్, అన్‌లోడింగ్ సేవలు అందిస్తున్న 528 మంది కార్మికులను మరో మూడు నెలల పాటు కొనసాగించేందుకు రూ.2.40 కోట్లు మంజూరుకు చేశాం.