Bigg Boss 7 Telugu:ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది

27
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 72 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా అమర్ దెబ్బకి శోభా డిఫెన్స్‌లో పడగా రతిక పెట్టిన దెబ్బకి యావర్ – అమర్ తన్నుకున్నారు. ఇక తాజా ఎపిసోడ్‌లో కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. తొలుత ప్రశాంత్..అర్జున్‌ని తర్వాత రతికను నామినేట్ చేశారు. తర్వాత అశ్విని ప్రియాంకని, అమర్‌ని నామినేట్‌ని చేసింది.

ఇక యావర్ వంతు రాగా శోభా శెట్టిని నామినేట్ చేశాడు. రాజమాతగా నాకు ఎవరు సపోర్ట్ చేశారు.. అంటూ యావర్ అడిగాడు. నాకు తెలీదు.. అది అందరూ తీసుకున్న డెసిషన్ అంటూ శోభా అంది. తర్వాత అమర్‌ని నామినేట్ చేశాడు యావర్. నువ్వు కెప్టెన్సీ టాస్కులో చేసింది నాకు నచ్చలేదు.. నా బొమ్మ ఎందుకు నువ్వు పట్టుకొని నిలబడ్డావ్.. అంటూ తెలిపాడు.

ఇక శోభా శెట్టి..యావర్‌ని,అశ్విని నామినేట్ చేసింది. నెగిటివ్ అని నాకు మొన్న చాక్లెట్ ఇచ్చావ్ కదా అది క్లారిటీ ఇవ్వు అంటూ అడిగింది. నీ బ్యాడ్ కెప్టెన్సీ నాకు నచ్చలేదు … నన్ను సెల్ఫ్ నామినేషన్ అయినా లిస్ట్‌లోకి తోసేశావ్.. అది నీ మైండ్‌లో ఉంది అందుకే నువ్వు నన్ను నామినేట్ చేశావ్ అంటూ క్లారిటీ ఇచ్చారు. తర్వాత గౌతమ్‌ని నామినేట్ చేశాడు అమర్. నేను నిజాయితీగా ఆడినా నువ్వు నన్ను నామినేట్ చేశావ్.. అందుకే చేస్తున్నా అంటూ చెప్పాడు. సెకండ్ నామినేషన్‌గా యావర్‌ని సెలక్ట్ చేశాడు. పాత వారాల్లో నుంచి తీసి మాట్లాడటం కరెక్ట్ కాదు.. ఎప్పుడో రెండో వారం నేను రతికతో ఏదో అన్నానని నువ్వు ఇప్పుడు నామినేట్ ఎందుకు చేశావ్.. అప్పటి నుంచి ఎన్నో వారులు పోయాయి కదా అప్పుడు ఎందుకు చేయలేదని అమర్ అడిగాడు.

Also Read:సురేఖా వాణి కూడా రెడీ అయ్యింది

ఇక చివరిలో శివాజీ వచ్చాడు. నువ్వు నేను ఎవరినో కొట్టి వెళ్లిపోతా అని చెప్పిన పాయింట్ మీద నామినేట్ చేయడం నాకు నచ్చలేదు.. అంటూ గౌతమ్‌కి చెప్పాడు. రెండో నామినేషన్‌గా ప్రియాంకని నామినేట్ చేస్తున్నా..నువ్వు అర్థం చేసుకుంటావని నిన్ను చేస్తున్నా అంతే.. అంటూ ప్రియాంకని నామినేట్ చేశాడు.దీంతో 11వ వారం నామినేషన్స్‌ ప్రక్రియ ముగియగా మొత్తం 8 మంది చేరారు. కెప్టెన్ కావడంతో శివాజీ, ఒకే ఓటు పడటంతో ప్రశాంత్ ఇద్దరూ నామినేషన్స్‌లో లేరు.

- Advertisement -