Tirumala:తిరుమల పవిత్రతను కాపాడటం అందరి బాధ్యత

35
- Advertisement -

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన‌ తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌య ప‌విత్ర‌త‌, విశిష్ట‌త‌ను కాపాడ‌టం ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌ని టీటీడీ ఈవో  ఎవి.ధర్మారెడ్డి అన్నారు. శుక్ర‌వారం డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో 25 మంది భ‌క్తులతో ఫోన్‌లో మాట్లాడారు. వారు ఇచ్చిన స‌ల‌హాలు, సూచ‌న‌లు విన్నారు.

ఇందులో న‌గ‌రికి చెందిన ప్ర‌కాష్ అనే భ‌క్తుడు మాట్లాడుతూ, తిరుమ‌ల‌లోని మీడియా ప్ర‌తినిధులు కొంద‌రు రాజ‌కీయ ప‌ర‌మైన ప్ర‌శ్న‌లు అడుగుతున్న కార‌ణంగా ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు ఆధ్యాత్మిక క్షేత్రంలో రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. అందుకు ఈవో స్పందిస్తూ, శ్రీ‌వారి ఆల‌య ప‌విత్ర‌త‌ను , వైభ‌వాన్ని కాపాడ‌టం ప్ర‌తి ఒక్క‌రి ధ‌ర్మ‌మ‌న్నారు. మీడియా ప్ర‌తినిధులు తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ను వారి ఆధ్యాత్మిక అనుభూతుల‌ను గురించి ప్ర‌శ్న‌లు వేస్తే బాగుంటుంద‌ని సూచించారు. తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడ‌టంలో ప్ర‌తి ఒక్క‌రు టీటీడీకి స‌హ‌కారం అందించాల‌ని ఈవో కోరారు.

ఆన్ లైన్ లో 2 ల‌క్ష‌లు, ఆఫ్ లైన్‌లో 5 ల‌క్ష‌ల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. టీటీడీ ఉద్యోగులు 100 శాతం అంకిత భావంతో సేవ‌లందిస్తున్నారు. కావున వారి విధుల‌కు ఆల‌స్యం కాకుడ‌ద‌ని త‌నిఖీలు ఉండ‌వన్నారు.

Also Read:లండన్‌ అంబేద్కర్ మ్యూజియంలో ఎమ్మెల్సీ కవిత..

- Advertisement -