TTD:వేదాలకు పుట్టినిల్లు తిరుమల

7
- Advertisement -

భారతీయ సంస్కృతికి మూలాధారమైన వేద సంప్రదాయాల పరిరక్షణ, ప్రచారం మరియు ప్రోత్సాహంలో టీటీడీ అగ్రగామిగా నిలుస్తోంది. ఈ దిశగా తిరుమలలోని ధర్మగిరిలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం దేశంలోనే అత్యున్నత వేద విద్యా కేంద్రంగా వెలుగొందుతోంది.

1884 ఫిబ్రవరిలో మహంత్ ప్రయాగ్ దాస్ జీ ఆధ్వర్యంలో స్థాపించబడిన ఈ వేదపాఠశాల ప్రారంభంలో మూడు విభాగాలతో మొదలై కాలక్రమేణా వేద, ఆగమ, పౌరోహిత్యం, శాస్త్ర విద్యలను సమగ్రంగా బోధించే విశిష్ట సంస్థగా అభివృద్ధి చెందింది. 1992లో తిరుమల ధర్మగిరిలో శాశ్వతంగా స్థాపించబడిన ఈ సంస్థకు “వేద విజ్ఞానపీఠం”గా పునర్నామకరణం చేశారు.

ప్రస్తుతం ఈ విజ్ఞానపీఠంలో నాలుగు ప్రధాన విభాగాల కింద మొత్తం 17 ప్రత్యేక విద్యా శాఖలు నిర్వహించబడుతున్నాయి. వేదాధ్యయనంలో 7 వేదశాఖలు, ఆగమాధ్యయనంలో 5 ఆగమాలు, స్మార్త అధ్యయనంలో 4 విభాగాలు, దివ్యప్రబంధంలో ఆళ్వారుల‌ 4000 పాశురాలు బోధించబడుతున్నాయి. ఈ కోర్సులు దీర్ఘకాలికంగా నిర్వహించబడుతూ విద్యార్థులకు లోతైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్నాయి.

ఈ విద్యాసంస్థలో ప్రస్తుతం మొత్తం 374 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అందులో వేద కోర్సుల్లో 140 మంది, ప్రబంధ-ఆగమ కోర్సుల్లో 177 మంది, స్మార్త కోర్సుల్లో 57 మంది ఉన్నారు. వీరికి బోధన అందించేందుకు 43 మంది పండితులు సేవలందిస్తున్నారు.

Also Read:KTR:జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యం కల్పిస్తాం

- Advertisement -