- Advertisement -
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడు రోజుల పాటు జరుగనున్న ఈ తెప్పోత్సవాల్లో సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు శ్రీ కోదండరామస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
మొదటిరోజు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తెప్పపై పుష్కరిణిలో విహరించారు. మొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అదేవిధంగా ఆదివారం శ్రీ పార్థసారథిస్వామివారు తెప్పలపై ఐదు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహిస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
Also Read:జీఎస్ఎల్వీ ఎఫ్ 14 … గ్రాండ్ సక్సెస్
- Advertisement -