టీటీడీ ఆధీనంలోకి రాజ‌నాలబండ ఆల‌యం

17
- Advertisement -

చిత్తూరు జిల్లా చౌడేప‌ల్లి మండ‌లం వెంగ‌ల‌ప‌ల్లి గ్రామంలోని రాజ‌నాలబండ శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామి మ‌రియు శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యాన్ని గురువారం టీటీడీ ఆధీనంలోకి తీసుకుంది.

ఈ మేర‌కు దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శ్రీ ఏకాంబ‌రం ఆల‌య ప‌త్రాల‌ను టీటీడీ డెప్యూటీ ఈవో శాంతికి అంద‌జేశారు. ఈ ఆల‌యాన్ని పుంగ‌నూరు గ్రూపు ఆల‌యాల ప‌రిధిలోకి తీసుకున్నారు.ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ డెప్యూటీ ఈవో జ‌న‌ర‌ల్ శివ‌ప్ర‌సాద్‌, సిఏవో వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఏఈవోలు మునికృష్ణారెడ్డి, మ‌ణి, త‌హ‌సీల్దార్ ల‌లిత‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ మునీంద్ర‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Also Read:హిందీ తెర పై శ్రీలీల అడుగులు

- Advertisement -