TTD:ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ అప్‌డేట్

4
- Advertisement -

పరిపాలనా కారణాల వల్ల డిసెంబర్ 29, 30 మరియు 31 (వైకుంఠ ద్వార దర్శనం) తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు శ్రీవాణి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లు పరిపాలనా కారణాల వలన విడుదల చేయబడవు అని టీటీడీ అధికారులు తెలిపారు.

ఈ టిక్కెట్ల విడుదలకు సంబంధించిన సవరించిన షెడ్యూల్‌ను త్వరలో టీటీడీ విడిగా ప్రకటిస్తుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వ‌ర‌కు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షించారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలోని యాగశాలలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

Also Read:తాల్ హెల్త్‌ఫెస్ట్ 2025కు అతిథిగా కేటీఆర్‌

- Advertisement -